ఆమె...నేను
చాలా రోజుల నించి చూస్తున్నాను ఆమెని...మా ఇంటి ముందు నించే వెళ్తూ వుంటుంది..రోజూ వెళ్తూ వుంటుంది...బహుశా ఏదో ఉద్యోగం చేస్తోంది అనుకుంటా...పెద్ద అందగత్తే కాదు కానీ ....ఆమె జుట్టు నన్ను కట్టి పడేస్తోంది...తుమ్మెద రెక్కల లాగ నల్లగా, చాలా వత్తుగా...పట్టు లాగ వున్న ఆమె జుట్టుని చూస్తుంటే నాకు నిద్ర పట్టడం లేదు....ఎలాగైనా ఆమెతో పరిచయం పెంచుకోవాలి అనుకున్నాను....కానీ కుదరలేదు...కానీ అనుకోకుండా...క్రిందటి వారం ఒక అద్భుతం జరిగింది...ఆమె, వాళ్ళ కుటుంబం మా పక్క వాటాలో కి వచ్చారు...నాకు చాలా సంతోషం కలిగింది...ఆమెని ఇప్పుడు చాలా దగ్గరి నుంచి చూస్తున్నాను...కానీ మాట్లాడటం కుదరడం లేదు....
ఆ రోజు ఆదివారం...నేను ఎప్పటి లాగానే డాబా మీదకి వెళ్లి పుష్ అప్స్ చేస్తున్నాను...ఇంతలో ఆమె వాళ్ళ డాబా మీదకి వచ్చింది.....ఆమె జుట్టు వదులుగా ఆమె వీపు నిండా పరుచుకుని వుంది...ఆమె తన జుట్టుని ఒక బ్రష్ తో దువ్వుకుంటోంది...వావ్...నాకు నోట మాట రావడం లేదు..నాకు జస్ట్...ఒక పదిహేను ఆడుగుల దూరంలో ఆమె...అలా ఆమెని చూస్తూ నిలబడి పోయాను..ఇంతలో ఆమె నన్ను చూసి నవ్వింది...నేను కూడా నవ్వాను....
"ఏమి చేస్తుంటారు?" అడిగింది.పిట్ట గోడకి దగ్గరగా వచ్చి నిలబడి...
"ఎం.బీ.ఏ"...మెల్లగా చెప్పాను...నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది..
"వెరీ గుడ్.."అంది....
అప్పటి నుంచి ఎదురుపడినప్పుడు నవ్వడం మొదలు పెట్టింది...
నాకైతే ఆమె జుట్టుని చూస్తూ యుగాలు గడిపేయవచ్చు అనిపిస్తోంది...అంత అందంగా వుంది ఆమె జుట్టు...
ఒక రోజు నేను టీవీ చూస్తున్నపుడు తలుపు మోగింది...లేచి తలుపు తీశాను...ఎదురుగా "ఆమె" .....వావ్...
"ఏంటి నన్ను లోపలి రానివ్వరా..."తలుపు దగ్గర అలాగే నిలబడి పోయిన నన్ను చూస్తూ అంది ఆమె...
"అయ్యో..సారీ..ప్లీజ్ ..రండి.."ఆమెకి దారి ఇచ్చి..లోపలి నడిచాను..ఆమె లోపలి వచ్చింది...నా రూం ని మొత్తం చూస్తూ "చాలా బాగుంది మీ ఇల్లు " మెచ్చుకోలుగా అంది..."
"థాంక్స్.." అన్నాను ఏమనాలో తెలీక...ఇంతలో లోపలి నుంచి అమ్మ వచ్చింది...
"నమస్తే ఆంటీ...నా పేరు సుకేశిని..మీ పక్క పోర్షన్ లోకి కొత్తగా వచ్చాము.." వినయంగా తనని పరిచయం చేసుకుంటూ అమ్మతో అంది ఆమె...
"సుకేశిని...!!...ఆమెకి పూర్తిగా సరిపోయింది అ పేరు.." అనుకున్నాను ఆమె జుట్టు వంక చూస్తూ...
"ఆంటీ..కొంచెం...పంచదార వుంటే ఇస్తారా...మళ్ళీ అరగంట లో తెచ్చి ఇచ్చేస్తాను...నాన్న కొలీగ్ వచ్చారు..టీ పెట్టాలి...పంచదార ఐపోయింది..." అంది అమ్మతో...
"అయ్యో అంతగా అడగాలా.వుండు ఇప్పుడే ఇస్తాను " అని అమ్మ లోపలి వెళ్లి ఒక గ్లాస్ నిండా పంచదార తెచ్చి ఆమె చేతిలో పెట్టింది...
"థాంక్స్ ఆంటీ..మళ్ళీ వస్తాను .." అని ఆమె వెళ్ళిపోయింది.
నేను వెనక నుంచి ఆమెనే చూస్తున్నాను...వతైన ఆమె జుట్టు అద్భుతంగా వుంది...మెత్తని పట్టు కుచ్చులాగా మెరుస్తోంది అది...అంత అందమైన జుట్టుని నా ఉహ తెలిసాక నేను చూడలేదు...ఆమె జుట్టుని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు..
ఒక గంట తరువాత మళ్ళీ తలుపు మోగింది...లేచి తలుపు తీసాను...ఎదురుగా చేతిలో పంచదార గ్లాస్ తో ఆమె...నవ్వుతూ లోపలి వచ్చింది...
"ఆంటీ లేరా?'' లోపలి చూస్తూ అడిగింది...
"అమ్మ లేదు..గుడికి వెళ్ళింది..."చెప్పను వంటి మీద టవల్ కప్పుకుంటూ...ఆమె పంచదార గ్లాస్ నా చేతిలో పెట్టి..."చాలా థాంక్స్" అంది...
''ఈ కాస్తకే...థాంక్స్ ఎందుకండీ..."మొహమాటంగా అన్నాను...
"సమయానికి చేసిన సాయం చిన్నదైనా..గొప్పదే.."అంది ఆమె నుదుటి మీద పడుతున్న వెంట్రుకలను వెనక్కి వేసుకుంటూ...
వావ్...ఏమా అందం....స్త్రీల జుట్టుకి ఇంత అందం ఉందా...
"సరే..నేను మళ్ళీ వస్తాను ఆంటీ వచ్చాక " అని ఆమె వెళ్ళడానికి రెండు అడుగులు తలుపు వైపు వేసింది....
"ఏం...నాతో మాట్లాడారా.."అన్నాను ...."అయ్యో...అలా అని ఏమీ లేదండీ..."అంది ఆగి..
"అలాగైతే..కొంచెం కూచోండి.."అన్నాను చొరవగా..
ఆమె తప్పదన్నట్టు కూచుంది....నేను ఆమెకి ఎదురుగా సోఫాలో కూచున్నాను...
"చెప్పండి..ఏం చేస్తుంటారు మీరు..?"అన్నాను
"ఒక ఆడిటర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్నాను..." ఆమె గొంతు చాలా తీయగా వుంది..
తరువాత చాలాసేపు నేను ఆమెతో మాట్లాడాను...ఆమె తల్లి ఆమె చిన్నప్పుడే చనిపోయారు...వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు....సవతి తల్లి ఈమెని సరిగా చూడదు..అదీ కాక ఆమె సవతి తల్లికి గుండె జబ్బు...ఆమె తండ్రి సంపాదన అంతా ఆమె వైద్యానికే సరిపోతుంది..అందుకని ఆమె తప్పని సరి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తోంది...
ఇలా చాల విషయాలు చెప్పింది ఆమె...చాలా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి అనిపించింది నాకు..
కొంచెం పరిచయం పెరిగాక..."మీ జుట్టు చాలా అందంగా వుంటుంది అండీ" అన్నాను ధైర్యం చేసి....
"ఔనా ....థాంక్స్ " అంది నవ్వుతూ...ఆమెకి ఆ కాంప్లిమెంట్స్ ఇప్పటిదాకా ఎంత మంది ఇచ్చి ఉంటారో...
రోజులు గడిచిపోతున్నాయి....నా ఏం.బీ.ఎ ఐపోయింది...ఒక స్టార్ హోటల్ లో మేనేజర్ ఉద్యోగం వచ్చింది...మంచి జీతం..హోదా...నా లైఫ్ బాగుంది.

No comments:
Post a Comment