Friday, 11 January 2013

కిరణ్ అమెరికా లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఈ మధ్యనే పెళ్లి అయ్యింది...భార్య ప్రియ...చాలా అందం గా వుంటుంది..ఆమె కేవలం డిగ్రీ వరకే చదివింది...కిరణ్ మేన మామ కూతురు..కిరణ్ కి కూడా ఆమె అంటే చాలా ఇష్టం..
పెళ్లి ఐన రెండు నెలలకి ఆమెని అమెరికా కి తీసుకొచ్చాడు కిరణ్...కొత్త జంటకి రోజు ఒక నిముషం లాగ గడిచి పోతోంది...కిరణ్ కి ప్రియ అన్ని విధాలా నచ్చింది..ఒక్క ఆమె జడ తప్ప...ఆమె జడ చాల లావుగా ఆమె పిరుదుల వరకు వుంటుంది...అందరూ ఆమె జడని తెగ మెచ్చుకుంటున్నారు...కాని కిరణ్ కి అంత పొడవు జడ నచ్చడం లేదు...కారణం,...అంత పొడవు వుంటే..ఎప్పుడూ ఒకే హెయిర్ స్టైల్ వేసుకోవాలి...ఎప్పుడూ జడే....ఇంకో రకంగా ప్రయత్నించడం కుదరదు...అదే పొట్టి జుట్టు అయితే...రకరకాలుగా కట్ చేయించుకోవచ్చు..ఒక సారి U షేప్ లో...ఒక సారి V షేప్ లో...ఒక సారి ఫెదర్ కట్..ఒక సారి స్టెప్ కట్..ఒక సారి బాబ్ కట్ ....కిరణ్ కి అలా వుంటే ఇష్టం..కానీ ప్రియది పొడవు జుట్టు కావడంతో ఎప్పుడూ అదే జడ..జడ..జడ...
అదీ కాక ఆమె జుట్టుని అస్సలు కత్తిరంచానివ్వదు...మొదట్లో ఆమె పొడవు జుట్టు బాగుంది కానీ పోను.పోనూ కిరణ్ కి అది బోర్ కొడుతోంది..
ఒక రోజు అదే విషయం ఆమెతో చెప్పాడు కిరణ్...
"నీ జుట్టుని షార్ట్ గా కట్ చేయించుకోవచ్చుగా..''
ప్రియ పక్క లో బాంబ్ పడ్డట్టు ఉల్లిక్కి పడింది...ఆమె ఏమీ మాట్లాడ లేదు..కిరణ్ కూడా ఆ టాపిక్ ని అంతటి తో వదిలేసాడు...కానీ అతనికి ఎలాగైనా ప్రియని వప్పించి ఆమె జుట్టుని పొట్టిగా కత్తిరించాలని వుంది...
అనుకోకుండా అతని కోరిక ఒక రోజు నెరవేరే అవకాసం వచ్చింది...ఒక రోజు కిరణ్, ప్రియ కలిసి న్యూ యార్క్ లో ఉంటున్న ప్రియ వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్లారు...అక్కడ తన కజిన్ స్వప్న జుట్టుని చూసిన ప్రియ షాక్ తింది...పిరుదుల మీద పడే ఆమె జుట్టు ఇప్పుడు భుజాల మీద పడుతోంది...వత్తైన జుట్టుని ఆమె చక్కగా బాబ్ కట్ చేయించింది...ఆ స్టైల్ లో ఆమె చాల అందం గా కనిపించింది ప్రియకి...
మధ్యానం భోజనం అయినాక ప్రియ, స్వప్న వాళ్ళ బెడ్ రూం లో కూచుని కబుర్లు మొదలు పెట్టారు..కిరణ్, స్వప్న భర్త రవి బయటికి వెళ్లారు..
'' ఏంటి ప్రియా. ఇంకా పొడవు జడనే వేసుకుంటున్నావా...?'' ఆశ్చర్యంగా అడిగింది స్వప్న..
ప్రియ తల ఊపింది...
"అంత పొడవు జుట్టు బోర్ ప్రియ..అందుకని నీను పోయిన సంవత్సరం...నా జుట్టుని పొట్టి గా కట్ చేయించాను...ఇప్పుడు చాలా హాయి గా వుంది..తెలుసా"
అని చెప్పింది స్వప్న...
ప్రియ ఆలోచిస్తూ తల ఊపింది..తరువాత స్వప్న వాళ్ళ ఆల్బం చూపించింది....ఆ ఫోటోలలో ఆమె రకరకాల హెయిర్ స్టైల్స్ తో వుంది..అన్నిట్లో ఆమె చాలా అందం గా వుంది..వాటిని చూస్తుంటే ప్రియ కి తను కూడా అలా వుంటే బాగుంటుందని అనిపించా సాగింది...ఆ రోజు సాయంకాలం ప్రియ వాళ్ళు తిరిగి తమ ఇంటికి వచ్చేసారు...
ఆ రోజు రాత్రి..వాళ్ళు భోజనం చేసి సరదాగా గడిపినాక..ప్రియ కిరణ్ తో అంది..
"కిరణ్...నేను నా జుట్టుని పొట్టిగా కట్ చేయించుకుంటాను..."
కిరణ్ ఆ మాటలు వినగానే చాల ఆనందించాడు...
"రేపే మనం సెలూన్ కి వెళ్దాము ప్రియా" అన్నాడు ఆమె పెదాలను తన పెదాలతో మూసేస్తూ...
మర్నాడు వాళ్ళు సేలూని కి వెళ్లి.....ప్రియ జుట్టుని భుజాలకి కొంచెం కింద దాకా ఉండేటట్లు ....ఫెధర్ కట్ చేయించారు..

No comments:

Post a Comment